వావ్‌.. ఉత్కంఠ పోరులో విజయం సాధించిన కోల్‌కతా

-

ఈరోజు జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయాన్ని సాధించింది . గుజరాత్‌ టైటాన్స్‌ పై జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుంది కేకేఆర్. కేవలం ఆరు బంతుల్లోనే 31 పరుగులు కావాల్సిన సమయంలో చివరి ఓవర్‌లో రింకుసాంగ్ విశ్వరూపం ఎత్తడు. ఏకంగా 5 సిక్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించాడు రింకు.

Kolkata's Rinku Hits Five Sixes In Final Over To Win IPL Thriller | Barron's

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో తమ స్టార్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకుండానే గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. నేడు రషీద్ ఖాన్ కెప్టెన్సీ వహించాడు. పాండ్య అనారోగ్యంతో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయలేదు. గత ఏడాది కూడా రషీద్ ఖాన్ ఒక మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా, ఆ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. అయితే ఈ సారి ఫలితం దీనికి భిన్నంగా వచ్చింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాయి దర్శన్‌, విజయ్‌ శంకర్‌లు మాత్రమే రాణించారు. సాయి సుదర్శన్ పోరాట ఇన్నింగ్స్ ఆడి వరుసగా రెండో మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించాడు.ఇక 14వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన శంకర్.. ఆ తర్వాత ఆఖరి రెండు ఓవర్లలో విరుచుకుపడ్డాడు. 19వ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదిన విజయ్ శంకర్ ఆ తర్వాత 20వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వరుసగా 3 సిక్సర్లు బాదాడు. శంకర్ కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టు స్కోరును 204 పరుగులకు చేర్చాడు విజయ్ శంకర్. అయితే రింకూ సింగ్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా జట్టుకు విజయం అందించాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news