భారీ వర్గాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించింది తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖ. ఇందులో భాగంగానే జియోగ్రాఫికల్ ఆధారంగా వరద ప్రభావిత ప్రాంతాలను నాలుగు భాగాలుగా విభజన చేసింది ప్రభుత్వం.
ప్రతి ఇంటా ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు వైద్యాధికారులు. మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా ప్రబలకుండా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించనుంది తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. 297 హై రిస్క్ ఏరియాల గుర్తించిన వైద్యాఆరోగ్య శాఖ…వరద ప్రభావిత ప్రాంతాలకు 670 మంది అదనపు వైద్య సిబ్బంది తరలించింది. ప్రతి ఇంటికి క్లోరిన్ మందు బిల్లల పంపిణీ చేస్తున్నారు అధికారులు.