తిరుమల శ్రీవారికి ఎన్నిరకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా?

-

కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామీ గురించి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్వామికి ఎన్ని రకాల ప్రసాదాలను సమర్పిస్తారు. ఏఏ సమయాల్లో పెడతారు అనే విషయాన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము..

బంగారంతో మెరిసిపోయే ఆనంద నిలయంలో కొలువైన స్వామివారు అలంకార ప్రియుడు మాత్రమే కాదు ఆహార ప్రియుడు కూడా. స్వామి వారికి తిరుమల లడ్డూతోపాటూ రకరకాల ఆహార పదార్థాలంటే ఎంతో ఇష్టం. అందుకే రోజూ వేంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదాలల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిని తెలుసుకుందాం.

ఎంతో రుచికరమైన తిరుమల లడ్డూతో పాటు వడ, అప్పాలు సమర్పిస్తారని చాలా మందికి తెలుసు. కానీ ఎక్కువ మంది భక్తులకు తెలియని దోష, జిలేజీ, మురుకు, పోలిలను కూడా స్వామి వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసి నివేదిస్తారు. ఇక్కడి లడ్డూ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఇక్కడి లడ్డూలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడ మనకు జిలేబీ మురుకులు కూడా లభిస్తాయి. వాటి ధరలను టీటీడీ నిర్ణయించింది.

ప్రసాదాల సమర్పణలో టీటీడీ పూర్వం లాగానే వ్యవహరిస్తూ వస్తోంది. శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారు నిర్ధేశించిన పూజా నియమాల ప్రకారంగానే స్వామి వారికి అన్ని పూజలను చేయిస్తూ వస్తోంది. టీటీడీ ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా హిందూ సంఘాలు పెద్ద గొడవ చేస్తున్నారు.

కేవలం గురు, శుక్ర వారాల్లో మాత్రం నైవేద్య సమయాల్లో మార్పులు ఉంటాయి. మిగతా రోజుల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఈ విధంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాలను అర్చకులు భక్తితో సమర్పిస్తూ వస్తున్నారు. ఎందుకంటే వేంకటేశ్వర స్వామి ఆహార ప్రియుడని మనకు అనేక పురాణాల్లో పేర్కొనబడింది.ఇది స్వామివారికి ప్రసాదాలు మరియు పూజల వివరాలు..

Read more RELATED
Recommended to you

Latest news