హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ప్రతి శనివారం MMTS రైళ్లు రద్దు

19 MMTS రైళ్లను నేటి నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేస్తున్నట్లు ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 5, ఫలక్నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య 11, ఫలక్ నుమా-హైదరాబాద్ మధ్య 1, రామచంద్రపురం – ఫలక్ నుమా స్టేషన్ల మధ్య 2 చొప్పున సర్వీసులను రద్దు చేశామని, వివిధ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. రైల్వే ట్రాక్‌ మరమ్మతులు, ఇతర కారణాల వల్ల కొన్ని రైళ్లను రద్దు చేస్తుంటుంది. అలాగే మరికొన్ని రైళ్ల సమయాల వేళల్లో మార్పులు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించడం వంటివి చేస్తుంటుంది. ఇందులో భాగంగా పలు రైళ్లు 9 రోజుల పాటు రద్దు చేస్తోంది. దీంతో ముందస్తుగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది. సెంట్రల్‌ రైల్వే పరిధిలోని దౌండ్‌-మన్మాడ్‌ నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

దౌండ్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే డెమొ రైలు జనవరి 20 నుంచి 28వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు, ఇది 9 రోజుల పాటు అందుబాటులో ఉండదని రైల్వే అధికారులు తె లిపారు. అలాగే నిజామాబాద్‌ నుంచి పుణె వెళ్లే డెమో రైలు జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉండదు. దీనిని కూడా రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే నిజామాబాద్‌-పండలిపూర్‌ వెళ్లే డెమో రైలు జనవరి 21 నుంచి అందుబాటులో ఉండదు. దీనిని రద్దు చేశారు. అలాగే న్యూఢిల్లీ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును మన్మాడ్‌, జగత్‌పురి, కల్యాణ్‌, పన్నేల్‌, పుణె, దౌండ్‌ మార్గాల్లో వివిధ కారణాల వల్ల దారి మళ్లించారు. జనవరి 27వ తేదీ నుంచి నడిచే బెంగళూరు-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును పుణెన, లోనావాలా, కజ్రత్‌, పన్వేల్‌, వాసాయ్‌ రోడ్‌, వడోదరా, రత్లామ్‌, మక్కి, సంత్‌ హిర్‌ధరమ్‌ మార్గంలో దారి మళ్లించారు. ఇక షిర్డీ నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చే రైళ్లు ఈనెల 23 నుంచి 26 వరకు ఆలస్యంగా నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు రైల్‌ సేవాను సంప్రదించాలని సూచించారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?