కెమికల్స్ లేకుండా పచ్చి మామిడిని ఇలా ముగ్గించండి…!

-

మామిడికాయలు పచ్చిగా ఉంటే చాలా మంది కెమికల్స్ వేసి వాటిని ముగిస్తూ ఉంటారు. కానీ నిజానికి అలాంటి వాటిని తినడం మంచిది కాదు వాటి వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కానీ ఎక్కువ మంది పచ్చి కాయలను కోసి వాటిని కెమికల్స్ తో పండ్లగా మారుస్తూ ఉంటారు.

 

ఇళ్లల్లో కూడా చాలా మంది ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఇలా చేయొద్దు. కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి వాటిని మీరు ఫాలో అయ్యి ముగించుకో వచ్చు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

రక్తహీనత సమస్య తో బాధపడే వాళ్లకు ఇది మంచిది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అయితే పచ్చి మామిడి కాయలు ని పండ్లుగా మార్చాలంటే రసాయనాలు వాడకుండా మీరు సహజసిద్ధమైన పద్ధతిని ఫాలో అవ్వొచ్చు. దీనికోసం మీరు ఒక పెద్ద డబ్బా తీసుకుని మొదటి అందులో బియ్యం పోసి ఆ తర్వాత మామిడికాయలు వేయండి.

తర్వాత మళ్లీ బియ్యాన్ని పోయాలి. తర్వాత మళ్లీ కాయల్ని పెట్టి మళ్ళీ బియ్యం పోయండి. ఫైనల్ గా మూత పెట్టేసి గాలి తగలకుండా చేయండి. ఇవి కదలకుండా అలా ఉంచితే ఎనిమిది రోజులకి పండ్ల కింద మారిపోతాయి ఇలా ఎలాంటి రసాయనాలు వాడకుండా మామిడి పండ్లను ముగించుకో వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news