RC15 నుంచి మరో లీక్.. కీలక పాత్రలో ఎస్‌జే సూర్య?

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ఫిల్మ్ RC15 పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నదని తెలుస్తోంది.

ఈ పిక్చర్ లో రామ్ చరణ్ విభిన్నమైన గెటప్ లో కనబడుతారట. IAS, IPS ఆఫీసర్ గా తన రోల్ ఉండబోతున్నదని రామ్ చరణ్ ఇటీవల లీక్ ఇచ్చారు. కాగా, సోషల్ మీడియాలో RC15 గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, యాక్టర్ అయిన ఎస్ జే సూర్య RC15 లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్.జే.సూర్య తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. యాక్టర్ గా ఆయన మహేశ్ బాబు ‘స్పైడర్’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఖుషీ, కొమురం పులి’ చిత్రాలకు ఎస్.జే.సూర్య దర్శకత్వం వహించారు. చూడాలి మరి..ఎస్.జే.సూర్య RC15 లో భాగమయ్యారో లేదో..తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. RC15 షూటింగ్ ప్రజెంట్ ఏపీలోని వైజాగ్ లో జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news