హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పులు కలకలం రేపాయి. శాలివాహననగర్ పార్క్ సమీపంలో సీపీఐ నేత చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు హైదరాబాద్ పాతబస్తీ – చంద్రాయణగుట్టలో గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడా రావడంతో అజీజ్ అనే యువకుడి హత్య జరిగింది. గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల్లో గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అజీజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా హత్య చేశారు ప్రత్యర్థులు.
https://twitter.com/bigtvtelugu/status/1944959744491561014