మెదక్ రైల్వే స్టేషన్‌కు మొదటి గూడ్స్ రైలు

-

మెదక్ రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరూక్ హుస్సేన్, సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ.. దశాబ్దాల కల ఈరోజు నిజం అయ్యింది. ముఖ్యమంత్రి గారి వల్ల సాధ్యం అయ్యిందని తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నిక తెస్తామని బీజేపీ చెబుతోందని.. ఈ ఉప ఎన్నిక ఎందుకు? అని ప్రశ్నించారు. రాజకీయ ఉపేక్ష, రాజకీయ ఆరాటం కోసమే ఈ ఉప ఎన్నిక.. ప్రజల మీద బీజేపీకి ప్రేమ ఉంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి డిమాండ్ చేశారు మంత్రి హరీష్‌రావు.

వరంగల్ కి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు…బయ్యారంకి ఉక్కు ఫ్యాక్టరీ లేదని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకం కోసం మనిషికి మెషిన్ లు పెడుతారట అని చురకలు అంటించారు గ్యాస్ సబ్సిడీ తీసేసారని…ఉన్న ఉద్యోగాలు పోయాయని మండిపడ్డారు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి…ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని చెబుతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news