ముందు నో చెప్పి.. తర్వాత ఓకే అన్నారు: శ్రుతి హసన్

-

లియో ఖైదీ,విక్రమ్‌ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్‌డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ‘ఇనిమేల్’ మ్యూజిక్ ఆల్బమ్ కోసం హీరోయిన్ శ్రుతి హాసన్తో నటించిన సంగతి తెలిసిందే. ఇనిమేల్’ అంటూ సాగే ఈ పాట ప్రోమో విడుదల కాగా ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్కు గురయ్యారు. ‘‘ఇది మా దర్శకుడు లోకేశ్‌ కనగరాజేనా..?’’, ‘‘రొమాంటిక్‌ సీన్స్‌ రాయడంలో పెద్దగా నాలెడ్జ్‌ లేదని చెప్పిన ఆయనేనా ఈయన..?’’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.వీరి కెమిస్ట్రీ చూసి ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే… ఈ ఆల్బమ్ విషయమై శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిలో నటించేందుకు ముందుగా లోకేశ్ నో చెప్పారని.. కాన్సెప్ట్ విన్నాక ఒకే చెప్పారని వెల్లడించారు. ఇందులో లోకేశ్ చాలా చక్కగా నటించారని తెలిపారు. కాగా ఈ పాటకు కమల్‌హాసన్‌ లిరిక్స్ అందించగా.. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. మార్చి 25న ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేయనున్నారు. గతేడాది ‘లియో’తో ప్రేక్షకులను అలరించిన లోకేశ్‌ కనగరాజ్‌.. ప్రస్తుతం తదుపరి సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version