విమాన ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఓ విమానం నుంచి మంటలు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. తాజాగా రష్యా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గగనతలంలో ఫ్లైట్ డోర్ ఓపెన్ అయ్యింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బలమైన గాలులు వీయడంతో పెద్దగా కేకలు వేశారు. అందులో కొందరు ప్రయాణికుల సామాన్లు గాల్లోకి ఎగిరిపోయాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ దిశను మార్చి విమానాన్ని సురక్షితంగా మగాన్ లో ల్యాండ్ చేశాడు.
ఇర్ ఎయిరో యాంటనోవ్ సంస్థకు చెందిన విమానం సైబీరియాలోని మగాన్ నుంచి టేకాఫ్ తీసుకుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 41 డిగ్రీలుగా ఉంది. రష్యా పసిఫిక్ తీరంలోని మగాన్ కు వెళుతుండగా మధ్యలో విమానం వెనుక డోర్ తెరుచుకుంది. దీన్ని ఓ ప్రయాణికుడు తన ఫోన్లో ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. అనంతరం అతడు ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 25 మంది ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.