Flipkart Black Friday Sale: మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..

-

మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌పై కళ్లచెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు కొన్ని రోజులే అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్డ్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ రేపటితో ముగియనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. మోటరోలా కంపెనీకి చెందిన ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌పై కూడా కళ్లుచెదిరే డీల్ ఉంది.
మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ రేటు రూ. 69,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 50,499కు కొనొచ్చు. అంటే కంపెనీ ఈ ఫోన్‌పై నేరుగా రూ. 19,500 వరకు తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 17,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్‌తో కలుపుకుంటే ఇంకా తక్కువ ధరకే మీకు ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వస్తుంది.
డిస్కౌంట్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి రెండింటినీ కలుపుకుంటే.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 37 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంటే భారీ తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ విలువ అనేది మీ ఫోన్, దాని కండీషన్ ప్రాతిపదికన మారుతుందని గుర్తించాలి.

స్పెసిఫేషన్స్..

ఈ మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ పీఓఎల్ఈడీ స్క్రీన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి పీచర్లు ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 200 ఎంపీ, 50 ఎంపీ, 12 ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే కంపెనీ ఫోన్ ముందు భాగంలో 60 ఎంపీ సెల్ఫీ కెమెరా అందించారు. . ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
 అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ ఫోన్ 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ ఉంది.
ఈ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.
వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పుకోవచ్చు. పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ ఆఫర్‌లో కొంటే మరింత అదనపు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news