వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి అరెస్టయ్యారు. పంజాగుట్ట సమీపంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులకు తెలియకుండా ఇంటి నుంచి బయటకు వచ్చిన వైయస్ షర్మిల… ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వెళ్లారు.
అయితే ఇది గమనించిన పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. దీంతో వైయస్ షర్మిలను పంజాగుట్ట పరిధిలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.