ఎగిరే కారు వచ్చేస్తోంది… అనుమతి ఇచ్చిన స్లోవాక్ ట్రాన్స్ ఫోర్ట్ అథారిటీ

-

ఎగిరే కార్లకు మరెంతో దూరంలో లేవు. భూమిపై, గాలిలో ఎగిరే హైబ్రీడ్ కారుకు అనుమతి లభించింది. ఎయిర్ కార్ క్రాఫ్ట్ గా పిలువబడతున్న ఈ కార్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ప్రమాణాల ప్రకారం 70 గంటల కఠినమైన పరీక్షల సమయంలో 200 కంటే ఎక్కువ టేకాఫ్ మరియు ల్యాండింగ్ లను పూర్తి చేసిన తర్వాత ఈ ఎయిర్ కార్ క్రాఫ్ట్ కి స్లోవాక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీచే ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేట్ పొందింది.

ఇది డ్యూయల్-మోడ్ వాహనం, ఇది మూడు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో రోడ్డు వాహనం నుండి విమానంగా మారుతోంది. 160 హార్స్ పవర్ బీఎండబ్ల్యూ ఇంజన్ ను ఈ కారులో అమర్చారు. ఇది సాధారణ పెట్రోల్ కారుగా ఉండనుంది. ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించేలా ఈ కారు రూపొందింది. 8,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో మరియు గంటకు 160 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ఎగిరే సామర్థ్యం కలిగి ఉంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news