వివాదంలో చిక్కుకున్న సింగర్ సునీత భర్త… మ్యాంగో మీడియాపై దాడి ?

టాలీవుడ్‌ టాప్ సింగర్‌ సునీత భర్త రామ్‌ వీరపనేని తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. రామ్‌ వీరపనేని నేతృత్వంలో.. మ్యాంగో యూట్యూబ్‌ ఛానల్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్‌ టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ తో ఈ ఛానెల్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే.. కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ రామ్‌ వీరపనేని పై గౌడ్‌ కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అంతేకాదు.. ఆ యూట్యూబ్‌ ఛానెల్‌ పై ఈ రోజు దాడికి కూడా ప్రత్నించినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో.. పోలీసులు జోక్యం చేసుకుని.. నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.   తమ సామాజిక వర్గ మహిళలను కించపరిచేలా తీసిన వీడియోలను వెంటనే డిలీట్‌ చేయాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.కాగా.. సింగర్‌ సునీత, రామ్‌ వీరపనేని ఇద్దరు రెండేళ్లే కిందట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సునీత భర్త ఆమె నుంచి డైవర్స్‌ తీసుకోవడంతో.. రామ్‌ ను వివాహం చేసుకుంది.