దేవుడా..వడను ఇలా కూడా చేస్తారా..?

-

ఏదైనా వంటను రుచిగా చేయడంతో పాటు దాన్ని సేల్ చేయాలంటే ఏదొక జిమ్మిక్కులు చేయాల్సిందే.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొందరు వ్యాపారులు విభిన్న రకాలుగా విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు తాము చేసే వంటకాలలో నాణ్యత పాటించడంతో పాటూ పని చేయడంలోనూ ప్రత్యేకతను కనబరుస్తుంటారు.ఈ మధ్య ఫుడ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే…ఫ్లయింగ్ దోస, రజిని స్టైల్ దోస ఇలా ఒకటేమిటి ఎన్నో వస్తున్నాయి. వాళ్ళు చేసే స్టయిల్ ను చూసి చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది. అదే ఫ్లయింగ్ దహి వడ..మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బడా సరాఫా అనే ప్రాంతంలో జోషి జి అనే వ్యక్తి.. పెరుగు వడను వినూత్నంగా అందిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ముందుగా ప్లేటులో వడ తీసుకుని, అందులో పెరుగు కలుపుతాడు. తర్వాత ప్లేట్‌ను గాలిలోకి ఎగరేస్తాడు. దీంతో పెరుగు ఎక్కడ కిందపడిపోతుందో అని అంతా అనుకుంటారు. కానీ విచిత్రంగా కొంచెం కూడా కిందపడకుండా దాన్ని పట్టు కుంటాడు..

ఆ తర్వాత దాని మీద కొన్ని రకాల మసాలాలను చల్లుతారు.మళ్లీ ఓ సారి గాలిలోకి ఎగరేస్తాడు. చివరగా అంతే స్టైల్‌గా పెరుగువడను కస్టమర్లకు అందిస్తాడు. 1977 నుంచి వంశపారంపర్యంగా తాము పెరుగు వడను అందిస్తున్నామని జోషి చెబుతున్నాడు. ప్లేట్ రూ.40కు అందిస్తున్నట్లు చెప్పాడు. ఇండోర్‌ వచ్చిన ఎవరైనా ఇక్కడి పెరుగు వడను రుచి చూసి వెళతారని అక్కడి వాళ్ళు చెబుతున్నారు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అక్కడికి వెళితే మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి..

 

Read more RELATED
Recommended to you

Latest news