మీ కారుకు ఉన్న నెగెటివ్‌ ఎనర్జీని ఈ విధంగా తగ్గించుకోండి!

-

వాస్తు నియమాలు ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉంటాం. ఇంటి నిర్మాణంతోపాటు బిజినెస్‌ వ్యవహారాల్లో కూడా వాస్తు శాస్త్రనిది కీలలక పాత్ర. ముఖ్యంగా మనం దిక్కులను బట్టి వాస్తు నియమాలను అనుసరిస్తాం. అంటే ఏ దిశలో ఏ వస్తువు పెడితే మనకు నెగిటివ్‌ ఎనర్జీ రాకుండా ఉంటుందో ఆ దిక్కుకు ప్రాధాన్యతనిస్తాం. అయితే, ఈ వాస్తు నియమాలు కేవలం ఇంటికే పరిమితం కాలేదు. వాహనాలకు సైతం వర్తిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీకు కారు ఉందా? అయితే, దానికి ఉన్న నెగిటీవ్‌ ఎనర్జీ తొలగించడానికి ఈ జాగ్రత్తలు తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు.

ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా ఏ కారును కొంటే మనకు లక్కీ వస్తుందో అది ఎలా నిరూపితమవుతుంది? కారు మాత్రమే కాదు.. ప్రతి వాహనానికి నెగెటివ్‌ ఎనర్జీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మీ వాహనాలకు ఎటువంటి నెగెటివ్‌ ఎనర్జీ బారిన పడిన ఈ వాస్తు నియమాలతో దాన్ని సులభంగా తొలగించుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారు సీట్ల లోపలి భాగంలో ప్రతిరోజూ రాత్రి సమయంలో ఓ న్యూస్‌ పేపర్‌ను పరచాలి.

అందులో కల్లు ఉప్పును వేయాలి. దాన్ని మరుసటి రోజు ఉదయమే వెంటనే తీసివేయాలి. దీనివల్ల మీ కారులో ఏవైనా దోషాలు ఉంటే ఇట్టే తొలగిపోతాయి. దీనికి మరో చిట్కా.. ఇసుకను చిన్న రాళ్లతో కలిపి చిన్న బాక్స్‌లో కారులో ఎక్కడైనా పెట్టాలి. దీంతో మీకు రాబోయే అనర్థాలను అడ్డుకట్ట వేయవచ్చు. అంతేకాదు కారులో శ్రీ యంత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. మారుతి యంత్రం, ఫెంగ్‌ షూయిని హ్యాంగ్‌ చేసుకోవచ్చు. వీటి వల్ల ప్రమాదాల నుంచి బయటపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news