వీడియో వైరల్: వీల్ చైర్ లో వెళ్తూ ఫుడ్ డెలివరీ…ఫిదా అయిన నెటిజన్లు..!

-

సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. కానీ తాజాగా వచ్చిన ఈ వీడియో మాత్రం హృదయాన్ని తాకుతోంది. అయితే మరి అసలు ఈ వీడియో లో ఏముంది అనేది చూద్దాం. కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో కనబడేవి హృదయాన్ని తాకుతుంటాయి. తాజాగా ఈ వీడియో ప్రశంసలను పొందింది. మామూలుగా ఫుడ్ డెలివరీ అనేది ఒక పని.

చాలా మంది ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు. పార్ట్ టైం కింద కానీ ఫుల్ టైం కింద కానీ ఫుడ్ డెలివరీ చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. కస్టమర్లకి ఫుడ్ ని సరైన సమయానికి డెలివరీ చేయాలని… డెలివరీ చేసే వాళ్ళు ఎండలో వానలో లేదంటే ట్రాఫిక్ లో బాధ పడుతూ.. కష్టపడి ఫుడ్ డెలివరీ చేయడం జరుగుతుంది. చాలా మంది ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఎంతో కష్టంగా పనిచేస్తారు ఇటువంటి వాళ్లను నిజంగా మెచ్చుకుని తీరాలి.

తాజాగా వీల్ చైర్ లో ఒక ఆమె ఫుడ్ ని డెలివరీ చేసింది. ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో ఆమె ఫుడ్ డెలివరీ ని వీల్ చైర్ లో తీసుకు వెళ్లడం మనం చూడొచ్చు నిజంగా ఆమె స్పెషల్లీ ఏబిల్డ్ అయినప్పటికీ స్వయంగా పని చేస్తోంది. ఇటువంటి వారిని మనం మెచ్చుకొని తీరాలి ఈ వీడియో కేవలం 6 సెకన్లు మాత్రమే. ఇప్పటికే సోషల్ మీడియాలో 263 వేల వ్యూస్ వచ్చాయి. 13వేల లైకులు వచ్చాయి నిజంగా ఆమె చేసిన పనికి చప్పట్లు కొట్టాల్సిందే. స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news