ఫ్రిడ్జ్ లో ఎట్టి పరిస్థితుల్లో.. ఈ ఆహారాన్ని పెట్టద్దు..!

-

ఫ్రిజ్ లో మనం ఆహార పదార్థాలు నిల్వ ఉండడానికి స్టోర్ చేస్తూ ఉంటాము. నిజానికి ఫ్రిడ్జ్ లో అన్ని ఆహార పదార్థాలని పెట్టకూడదు. కొన్ని ఆహార పదార్థాలని మాత్రమే ఉంచాలి. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్ లో పెడితే లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎక్కువ మంది ఫ్రిజ్ లో కూరగాయలు, పండ్లు, పాల పదార్థాలు, పాలు వంటివి పెడుతూ ఉంటారు. అయితే ఫ్రిడ్జ్ లో కొన్ని వాటిని మాత్రం అసలు ఉంచకూడదు. మరి ఏ ఏ ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అవకాడో:

అవకాడో ని ఫ్రిజ్లో అసలు ఉంచకండి ఎందుకంటే డ్రై ప్లేస్ లో పెట్టిన కూడా పండ్లు బాగానే ఉంటాయి కాబట్టి అవకాడో ని ఫ్రిజ్లో పెట్టొద్దు.

పుచ్చకాయ:

పుచ్చకాయ తాజాగా ఉన్నప్పుడే కోసుకుని తినడం మంచిది ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పోషక పదార్థాలు తగ్గిపోతాయి అదేవిధంగా పుచ్చకాయ రుచి మొత్తం పోతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లిని ఫ్రిజ్లో ఉంచక్కర్లేదు. బయటనే ఉంచాలి. పోషక పదార్థాలు తగ్గిపోతాయి ఫ్రిజ్ లో ఉంచితే. అలానే వెల్లుల్లిని ఫ్రిజ్లో పెడితే మొలకలు మొలిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పెట్టకండి.

వంకాయ:

వంకాయలని కూడా ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు. పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ లో వీటిని ఉంచి తినడం మంచిది కాదు కాబట్టి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండడమే మంచిది.

చాక్లెట్లు:

చాక్లెట్లు పెట్టడం వలన రుచి మారిపోతుంది ఎండ తగలకుండా ఉండే చోట పెడితే సరిపోతుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలని కూడా ఫ్రిజ్లో ఉంచకండి ఓపెన్ బాస్కెట్ లో బయట ఉంచితే ఉల్లిపాయలు పాడైపోకుండా ఉంటాయి.

బంగాళాదుంపలు:

బంగాళదుంపలు ఫ్రిజ్లో ఉంచడం వలన స్టార్చ్ డీకంపోజ్ అయిపోతుంది దీనితో టేస్ట్ కూడా తగ్గుతుంది.

దోసకాయ:

ఫ్రిజ్లో దోసకాయని పెట్టకండి దీని వలన దోసకాయ మీద ఒక పల్చడి పొర పేరుకుపోతుంది దీంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news