బ్రేకింగ్ : వానపాము పడ్డ పప్పు తిని.. 36 మంది గిరిజన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

-

బ్రేకింగ్ : వానపాము పడ్డ పప్పు తిని.. 36 మంది గిరిజన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…మహబూబాబాద్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ కలుషిత ఆహారం తిన్న 36 మంది విద్యార్థినులకులకు అశ్వస్తత నెలకొంది. అంతే కాదు…నలుగురు విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత నెల కొన్నట్లు సమాచారం అందుతోంది.

మహబూబాబాద్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, ఆర్డీవో ఆఫీస్ సమీపంలో వున్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వానపాము పడ్డ పప్పు, కిచిడి పెట్టారని ఆరోపిస్తున్నారు విద్యార్థినులు. ఇక బాధ్యత విద్యార్థులను మహబూ బాబాద్ ఏరియా హస్పిటల్ కి తరలించారు ఉపాధ్యాయ బృందం. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యం లో వార్డెన్ మీద విద్యార్థుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రావాలంటూ హస్టల్ లో విద్యార్థులు అందోళనకు దిగారు. హాస్టల్ ప్రస్తుతం కూడా అందోళన కొనసాగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news