RAIN ALERT : హైదరాబాద్ లో మళ్లీ వర్షం.. బయటకు రాకండి

-

రెండ్రోజులు చిన్న బ్రేక్ ఇచ్చిన వరణుడు మళ్లీ విజృంభించాడు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రెండ్రోజుల నుంచి కాస్త కనిపించింది. హమ్మయ్య అనుకునేలోగా మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన వారు తిరిగిస్తున్న సమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానలో తడిసిముద్దవుతున్నారు.

నగరంలోని బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోటి,అంబర్ పేట్, బేగంబజార్, అల్వాల్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, ఎల్ బి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, బీఎన్ రెడ్డిలో భారీ వర్షం కురుస్తోంది. షేక్ పేట, రాయదుర్గం,అమీర్ పేట్, కూకట్ పల్లి, బాలానగర్ లో కురుస్తున్న వానకు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాళ్లంతా వానకు తడిసిముద్దవుతున్నారు.

మరోవైపు కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, అన్నోజిగూడ, కుషాయిగూడ , సైనిక్ పురి, కాప్రా, చర్లపల్లి, దమ్మాయిగూడ , కీసర పరిసర ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news