కొన్ని ప్రాంతాల్లో ఎంత తవ్వినా నీరు రాదు.. అలా వదిలేసి మళ్లీ వేరే చోట ప్రయత్నిస్తారు.. అయితే చత్తీస్‌గడ్( Chhattisgarh)రాష్ట్రంలో ఓ వింత జరుగుతుంది. అది నిన్న మొన్న జరిగింది కాదు.. 19 ఏళ్ల నుంచి ఎవరూకొట్టకుండానే చేతిపంపు నుంచి నీరు ధారాపాతంగా వస్తుంది. అది కూడా మంచినీరు. పాతాళగంగ ఏమైనా అక్కడ ఉందా అనే విధంగా ఆ బోర్‌లోంచి నీరు వస్తుంది. ఇప్పుడు ఈ పంపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చత్తీస్‌గడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా సుక్మా బ్లాక్‌లోని మరోకి గ్రామంలో ఓ విచిత్రమైన తాగునీటి పంపు ఉంది. సుమారు 19ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో బోర్ వేయడానికి వచ్చిన వాళ్లు నీటి కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో 10అడుగుల లోతులోనే నీరు పడటంతో బోర్ వేసి వెళ్లిపోయారు. గ్రామంలో సుమారు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి.ఈ పంపును నుంచి ఎవరూ కొట్టకుండానే నీరు రావడం విశేషంగా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలో వేసిన ఈ పంపు స్థానంలో పాతాళగంగ ఉందా అన్నట్లుగా ఏడాది పొడవునా నిత్యం మంచినీరు వస్తూనే ఉంటుందట..
అప్పటి నుంచి ఇప్పటి వరకు సీజన్‌తో పని లేకుండా ..మండు వేసవిలో కూడా మరొకి గ్రామంలో రెండు వందల కుటుంబాల ప్రజలు మంచి నీరు కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ఈ బోర్ నీరు వాడతారు.. కనీసం బోర్ కొట్టాల్సిన అవసరం కూడా రాలేదని గొప్పగా చెబుతున్నారు. నీరు పుష్కలంగా ఉండే ప్రాంతాల్లోనే వేసవి కాలం వచ్చిందంటే తాగునీరు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది.. చాలా చోట్ల వేరే ప్రాంతం నుంచి ట్యాంకులతో నీటిని తెప్పించుకుంటారు.
మరొకి గ్రామంలో మాత్రం గత 19ఏళ్లుగా అలాంటి అవసరం లేకుండా ఈ బోర్ వారి దాహం తీరుస్తుంది. అధికారులు కూడా ఈ విషయంపై ఆరా తీశారు. ఎవరూ కొట్టకుండా అందులోంచి నీరు ఎలా వస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే..!