‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

-

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. తాజాగా సమ్మెతమేతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించాడు. ఇక లెటెస్ట్‌ గా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అంటూ డిఫరెంట్ టైటిల్తో ఈ మధ్య వచ్చేసాడు కిరణ్ అబ్బవరం.

ఈ సినిమా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కగా.. కిరణ్ అబ్బవరం కు జోడిగా సంజన ఆనంద్ హీరోయిన్గా నటిచింది. ఇక మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా.. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మించారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను ఆహా లో రిలీజ్‌ చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన ఆహా లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అంతేకాదు.. ప్రైమ్‌ వీడియోలో 14వ తేదీ నుంచి రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news