చర్మం నిగనిగ మెరవడానికి తోడ్పడే ఔషధం.. ఇంటి చిట్కా..

-

చర్మం నిగనిగ మెరిసిపోతే చూసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా ఒక్కరోజు ఏంట్రా నువ్వీరోజు మెరిసిపోతున్నావు అని అంటే మురుసిపోని వాళ్ళు ఉండరు. అందుకే చర్మ సంరక్షణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మన శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మానికి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా పోవు. పిలవకుండానే వచ్చి వెళ్ళమని ఎంత మొత్తుకున్నా అలాగే తిష్ట వేసుకుని కూర్చుంటాయి. చర్మానికి వచ్చే చాలా సమస్యలు ఇలాగే ఉంటాయి.

ఐతే ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సింది చర్మం నిగనిగ మెరవడానికి ఏం చేయాలనేది. దీని కోసం మార్కెట్లో చాలా రకాల సాధనాలు ఉన్నాయి. కానీ అవి ఖరీదైనవి, అందరికీ అందుబాటులో ఉండనివి. అందువల్ల ఇంట్లో తయారు చేసుకునే ఔషధం గురించి తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఇంట్లో తయారు చేసుకునే ఔషధాలే చర్మంపై చాలా చక్కగా పనిచేస్తాయి.

కావాల్సిన పదార్థాలు

టమాట
అల్లం
ధన్యాలు

తయారీ విధానం

ఈ మూడింటినీ ఒక దగ్గర కలిపి బాగా మిక్స్ చేయాలి. జ్యూస్ లాగా తయారయ్యాక పొద్దున్న పూట తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయాలి.

లాభాలు

టమాటల్లో ఉండే పోషకాలు చర్మంపై వెలువడే అనేక నూనెలని ఉత్పత్తి చేయకుండా చూసుకుంటుంది. దానివల్ల నల్లమచ్చలు, కళ్ళకింద వలయాలు ఏర్పడకుండా ఉంటుంది. అలాగే అల్లంలో ఉండే పదార్థాలు శరీరానికి గట్టిదనాన్ని ఇవ్వడంతో పాటు మెరిసే చర్మాన్ని అందిస్తాయి. ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ ఔషధం చాలా ఉపయోగకరమైనది. మెరిసే చర్మం కావాలనుకునే ఒక్కసారి ప్రయత్నిసే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news