జూలై నెలలో పుట్టిన వారికి అదృష్టం మాములుగా లేదు..జాతకం ఎలా ఉందంటే..?

-

ఒక్కో నెలలో పుట్టిన వారికి ఒక్కో విధమైన ప్రవర్తన తో పాటు జాతకం కూడా మారుతుంది..హిందువులు ఎక్కువగా జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు.ఈరోజు నుంచి జూలై నెల మొదలైంది.ఈ నెల లో పుట్టిన వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..పుట్టిన తేదీ టోటల్ నెంబర్‌ను బట్టి ఆ వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో చెప్పేదే సంఖ్యాశాస్త్రం.పుట్టబోయే బిడ్డల విషయాల్లోనూ చాలామంది మంచి రోజు కోసం ఎదురు చూస్తారు.. జూలై 2022లోని కొన్ని తేదీల్లో పుట్టినవారి జాతకాలు చాలా అద్భుతంగా ఉండనున్నాయి.

జూలై నెల వారి జీవితంలో ఆనందాలు, సంపద, అభివృద్ధిని తీసుకురానున్నాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టినతేదీ టోటల్ నెంబర్ 2 అయితే లెక్కలేనంత డబ్బు వస్తుంది. అదే టోటల్ 3 అయితే లాభాలు ఆర్జిస్తారు. టోటల్ 1 నుంచి టోటల్ 9 వరకూ ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే.. ఒక వ్యక్తి పుట్టిన తేదీ టోటల్ 1 అయితే ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యవసాయంలో, ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చు. వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు మొదలు కావచ్చు. ఏదైనా పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. పుట్టిన తేదీ టోటల్ 2 అయితే లాభదాయకంగా ఉంటుంది. పాత అప్పుల్నించి విముక్తి పొందుతారు. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో వివాదం తలెత్తవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి అధికమౌతుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు..
అదే విధంగా 3 వస్తే వారికి లక్ కలిసి వచ్చినట్ట.. ఎందుకంటే వారికి అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే సుదూర యాత్రలు చేస్తారు.

ఈ నెల ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో ఐకమత్యం, ప్రేమ లభిస్తుంది. కోపాన్ని నిగ్రహించుకోగలిగితే అధికా లాభాలు ఉంటాయి. ఒకవేళ పుట్టినతేదీ టోటల్ నెంబర్ 4 అయితే.. ఆర్ధికంగా లాభపడతారు. కొత్త బంధాలతో ప్రేమ, ఆర్ధిక ప్రయోజనాలు చేకురుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అయితే వారు భారీ పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిందని నిపుణులు అంటున్నారు..

టోటల్ నెంబర్ 5 కానీ అయితే.. వారికి వ్యాపారం, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలు ఫలిస్థాయి కానీ మిత్రుల్నించి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.టోటల్ నెంబర్ 6 అయితే మాత్రం సమస్యలు ఎదుర్కోక తప్పదు.. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు. విడాకులు కూడా తీసుకొనే ప్రమాదం ఉంది. కానీ ఆర్ధికంగా బాగుంటుంది.7 అయితే చెప్పనక్కరలేదు అన్నీ రంగాల్లొ మంచి లభిస్తుంది.ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి..టోటల్ 8 సంఘర్షణ ఉన్నా ధనలాభం ఉంటుంది. పెండింగులో ఉన్న కోర్కెలు నెరవేరుతాయి. సంతాన సుఖం ప్రాప్తిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది..అదే టోటల్ 9 అయితే జీవితంలో చాలా మార్పులు చూస్తూ ఉంటారు. కానీ అవన్నీ స్వల్పకాలికంగానే ఉంటాయి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి..అనుకోని గుడ్ న్యూస్ లు వింటారు..ఈ నెల మొత్తం వీరికి మంచి సమయం నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news