తెలంగాణ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది. కరోనా సమయంలో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించి ఆసరగా నిలిచింది.తాజాగా ఉద్యోగ భర్తీకి సంబంధించి మరో నోటిఫికేషన్ ను విడుదల. చేసింది.వైద్య విభాగంలో ఖాళీల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వైద్య విభాగంలో ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహబూబ్ నగర్ మెడికల్&హెల్త్ ఆఫీసర్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పల్లె దవాఖానాల్లో పని చేయాడానికి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 3ని ఆఖరి తేదీగా నిర్ణయించారు..ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొవాలి..
పూర్తీ వివరాలు..
మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల విషయాలను పరిశీలిస్తే.. M.B.B.S విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు ముందుగా మహబూబ్ నగర్ జిల్లా అధికారిక వెబ్ సైట్ https://mahabubnagar.telangana.gov.in/ ను ఓపెన్ చేయాలి.
అనంతరం హోం పేజీలో Recruitments ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Medical Officer at Palle Dawakhana in Mahabubnagar District నోటిఫికేషన్ కనిపిస్తుంది. పక్కన Application లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ లో పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, తదితర వివరాలను నమోదు చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి.
పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ ను జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయం, మహబూబ్ నగర్ చిరునామాలో ఈ నెల 3వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది..
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకొవాలి…