మహబూబ్ నగర్ జిల్లా సలేశ్వరం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. రాష్ట్రంతోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శివయ్యను దర్శించుకుంటారు. అయితే.. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు అటవీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు.. తమ వెంట ప్లాస్టిక్ సామాగ్రి, వస్తువులు తీసుకురావద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఈసారి సలేశ్వరం జాతర ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
అగ్గి పెట్టలు, బీడీలు, సిగరెట్లు, అడవిలో నిప్పు రాజేసే వీలున్న ఎలాంటి వస్తువులు వెంట తేవద్దని తెలిపారు. మన్ననూరు చెక్ పోస్ట్ నుండి రాం పూర్ పెంట కు వెళ్లే దారిలో ఎక్కడా వాహనాలు ఆపొద్దని, శబ్దాలు చెయ్యొద్దని సూచించారు. అడవిలో మద్యం సేవించటం, బీడీలు, సిగరెట్లు తాగటం నిషిద్దమని చెప్పారు. దైవ దర్శనం కాగానే సాయంత్రం 6 గంటలలోపు అడవి నుంచి బయటకు వెళ్లిపోవాలాన్నారు. అడవిలో ఉండటానికి ఎవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేసారు.