పదో తరగతి విద్యార్థులకు మంత్రి హరీశ్‌రావు ఆశీస్సులు

-

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతీ విద్యార్థికి పేరుపేరునా మంత్రి హరీశ్‌రావు ఆశీస్సులు అందించారు. వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నందున విద్యార్థుల్లో మనోధైర్యం కల్పించారు మంత్రి హరీశ్‌రావు. కష్టంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంకల్పం వల్లే గత ఏడాది సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుందని గుర్తు చేశారు మంత్రి హరీశ్‌రావు. ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలని మంత్రి హరీశ్‌రావు హితబోధ చేశారు.

 

Minister Harish Rao | మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి : మంత్రి  హరీశ్‌రావు-Namasthe Telangana

విద్యార్థులను ప్రొత్సహించడానికి ప్రతీ ఒక్కరికీ ఉత్తరం రాశానని, ఆ ఉత్తరాలు అందుకున్న విద్యార్థులు చాలా సంతోషపడ్డారని తెలిపారు.పలుమార్లు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించడమే గాకుండా ప్రత్యక్షంగా సమీక్షలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అంతేగాకుండా విద్యార్థుల మానసిక, శారీరక ధృడత్వం ఉండేలా ప్రతీరోజు ఆల్పాహారం, ప్రత్యేక తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్‌ కంటెంట్‌ విధానంతో పదో తరగతి విదార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అందించి మరింత తోడ్పాటును కలిగించామని పేర్కొన్నారు. ఉన్నత విద్యకు దిశానిర్ధేశం చేసే పదో తరగతి పరీక్షలను ప్రతీ విద్యార్థి సైతం బాగా రాయాలని, తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని మంత్రి ఆల్‌దిబెస్ట్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news