హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊనా జిల్లాలోని మురికివాడలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కాలి నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే చిన్నారులు కాలి బూడిదయ్యారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరి మంటలు వ్యాపించకుండా ఆర్పారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీశారు. మృతులంతా బిహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నలుగురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.