కరోనా విపత్తు కాలంలో చాలా రకాల సంస్థలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆక్సిజన్ అందిస్తే.. మరికొన్ని కరోనా పేషెంట్లకు బెడ్లు అరేంజ్ చేస్తున్నాయి. మరి కొన్ని పేదలకు ఉచితంగా భోజనాలు అందిస్తున్నాయి. ఇప్పడు రిలయన్స్ సంస్థ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సప్లయ్ చేస్తోంది రిలయన్స్ సంస్థ. దాదాపు 50టన్నుల ఆక్సిజన్‌ను అందజేసింది. దీంతో పాటు ఇప్పుడు మరో భారీ సాయం చేసేందుకు ముందుకొచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఆపదలో ఉన్న పేషెంట్లను, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న అన్ని అంబులెన్సులకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ అందిస్తామని చెప్పింది. రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో ఒక్కో అంబులెన్సుకు రోజుకు గరిష్టంగా 50లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. తమ వంతు సేవ చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. ఎంతైనా రిలయన్స్ సేవలు బాగున్నాయి కదా.