కరోనా విషయంలో ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం అంటూ షర్మిల టీం మండిపడింది. షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరాశోభన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ కూడా ఆమె మండిపడ్డారు. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టకుండా ఉచిత సలహాలా..? అని నిలదీసారు. కరోనా పరిస్థితితో పాటుగా ఆరోగ్య వ్యవస్థ తీరుపై కూడా ఆమె విమర్శలు చేసారు.
పక్కరాష్ట్రాల్లో పేషెంట్ల బిల్లులు కడుతున్నారని చెప్పడం సిగ్గుచేటు అంటూ కూడా ఆరోపించారు. ఏపీలో కరోనా, బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చలేదా..? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రయివేట్లో టెస్టులు ఎందుకు చేయించుకున్నారో ప్రజలకు చెప్పాలి అంటూ డిమాండ్ చేసారు. హైకోర్టు అంక్షింతలు వేసినా ప్రయివేటు ఆస్ప్రతుల ధరలను రెగ్యులేట్ చేయరా..? అని ప్రశ్నించారు.