తెలంగాణ లో కొత్త పథకం.. రూ.2 వేలు చేసే కిట్ ఫ్రీ.. 1.24 లక్షల మందికి బెనిఫిట్..!

-

కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే చాలా స్కీమ్స్ ద్వారా ప్రజలకి ప్రయోజనాలని ఇస్తోంది. అలానే కొత్త స్కీమ్స్ మీద కూడా దృష్టి పెడుతోంది. అలానే గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని కూడా షురూ చేయనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని తీసుకు వస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇంకో కొన్ని రోజుల్లో కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ దీన్ని స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు. పోషకాహార లోపం, రక్తహీనతతో బాధ పడుతున్న గర్భిణులకు ఈ స్కీమ్ ద్వారా కిట్ ని అందించనున్నారు. ఈ కిట్ లో ఐరన్ సిరప్ 2 బాటిళ్లు, నెయ్యి 500 గ్రాములు, ఖర్జూరం ఒక కిలో, అల్బెండజోల్ ట్యాబెట్లు, హార్లిక్స్ 2 బాటిల్స్ ఉంటాయట.

దీని విలువ రూ.2 వేలు. దీన్ని గర్భిణులకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. ఈ కిట్స్ ని ఇప్పటికే గవర్నమెంట్ సిద్ధం చేసింది. 5వ నెల, 9వ నెలల్లో మొత్తం రెండు సార్లు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.24 లక్షల మందికి వీటిని అందించనున్నారు. దాదాపు 2,29,552 న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసేందుకు చూస్తోంది ప్రభుత్వం. ఆరోగ్య కేంద్రాల ద్వారా వీటిని అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news