ఏపీలో విషాదం చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా ఆదోని సమీపంలోని కోసిగి గ్రామానికి చెందిన తాయమ్మ (30)కు హనుమంతు తో వివాహం అయ్యింది. వీరికి ఓ ఆడబిడ్డ సంతానం. వీరి సంసారం హాయిగా సాగుతుండగా హనుమంతు హఠాత్తుగా మృతి చెందాడు.
దీంతో ఒంటరిగా మారిన తాయమ్మ తన బిడ్డతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. అక్కడే పనులు చేసుకుంటూ కూతురిని పోషించుకునేది. ఇలా ఒంటరి జీవితం గడుపుతున్న ఆమెపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కన్నేసాడు. మాయ మాటలతో తాయమ్మకు శారీరకంగా దగ్గర అవడమే కాదు సహజీవనం చేయసాగాడు.
ప్రియుడితో కలిసి రెండేళ్ల సహజీవనం ఫలితంగా తాయమ్మ గర్భం దాల్చింది. దీంతో భర్త లేకుండా గర్భం దాల్చినట్లు బయటపడితే పరువు పోతుందని ఆమె ఆందోళనకు గురైంది. దీంతో తనను అందరి ముందు పెళ్లి చేసుకుని భార్యగా స్వీకరించాలని ప్రియుడిని కోరింది. అయితే అప్పటికే అతడికి పెళ్లయి పిల్లలు ఉండటంతో అందుకు నిరాకరించాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.