ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక…ఎవరికి అంటే ?

-

Free sand for Indiramma’s houses:  తెలంగాణలోని ప్రజలకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇల్లు లేని పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదివరకే కొంతమందికి ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించగా కొంతమంది పట్టాలు అందుకున్నారు. కాగా, మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం చాలామంది దరఖాస్తులు సైతం పెట్టుకున్నారు.

Key announcement on Indiramma houses
Key announcement on Indiramma houses

ఇందులో లబ్ధిదారులు అయిన వారికి ఇసుక కొరత రాకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల చర్యలను చేపట్టింది. మొదటి రెండో దశలకు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమైన తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ఒక్కో లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను నాలుగు విడతలలో అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇసుక కోసం ఎమ్మార్వో కార్యాలయంలో టోకెన్లు పొంది లబ్ధిదారులు ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా, గత కొద్దిరోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం పక్క జిల్లాల నుంచి ఇసుక సరాఫరాకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news