జనవరి 15 నుంచి ఈ కంప్యూటర్లలో గూగుల్‌ క్రోమ్ సేవలు బంద్‌..

-

గూగుల్‌ను వాడని వారంటూ ఎవరూ ఉండరు.. సర్జ్‌ ఇంజిన్స్‌లో ఇంకా మనకు చాలా ఉన్నాయి.. అందరూ గూగుల్‌నే ఎంచుకుంటారు.. బ్రౌజింగ్‌కు ఇదే కంఫర్ట్‌గా ఉంటుంది. గూగుల్‌ సర్వీస్‌లను ఉపయోగించే డివైజ్‌ల భద్రత కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్‌లను అందిస్తుంటుంది. తాజా వెర్షన్‌లకు సపోర్ట్‌ చేయని పాత డివైజ్‌లకు సేవలు నిలిపివేస్తుంది. అందులోభాగంగానే.. గూగుల్ తన క్రోమ్ యూజర్‌లకు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. పీసీల్లో ఓల్డ్ విండోస్ వెర్షన్ వాడే యూజర్‌లకు క్రోమ్‌ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
గూగుల్ లాంచ్‌ చేసిన క్రోమ్‌ బ్రౌజర్‌ మొదటి స్థానంలో ఉంది. గూగుల్ క్రోమ్ వేగవంతమైన బ్రౌజింగ్, సేఫ్ బ్రౌజింగ్ ఆప్షన్‌లతో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది.. 2008లో మైక్రోసాఫ్ట్ కోసం లాంచ్ అయిన ఈ బ్రౌజర్ తర్వాత వివిధ ప్లాట్‌ఫారంలకు ఎగబాకింది..అయితే రాబోయే వారాల్లో పాత విండోస్ PCలలో క్రోమ్ పాత వెర్షన్‌లు పనిచేయడం మానేస్తాయని గూగుల్ స్పష్టం చేసింది.. జనవరి 15వ తేదీని గడువుగా పేర్కొంది. క్రోమ్ వెర్షన్ 110 త్వరలో విడుదల కాబోతున్నందున గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది..

ఈ పీసీల్లో పనిచేయదు..

క్రోమ్ చరిత్రలోనే అతిపెద్ద అప్‌గ్రేడ్‌లలో ఒకటిగా ఇది నిలవనుంది. పాత విండోస్ వెర్షన్‌లు మైక్రోసాఫ్ట్ నుంచి సెక్యూరిటీకి సంబంధించి సపోర్ట్‌ కోల్పోనున్నాయి. ఇప్పటికే విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్‌లో నడుస్తున్న PCలలో తన సేవలు నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది. క్రోమ్ 109 అనేది విండోస్ 7, విండోస్ 8/8.1కి సపోర్ట్‌ చేసే చివరి వెర్షన్. క్రోమ్ 110 తాత్కాలికంగా 2023 ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ వెర్షన్‌ విండోస్ 10 లేదా తదుపరి ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలోనే రన్‌ అవుతుందట. క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించడానికి ఇప్పుడు విండోస్ 10 లేదా 11 PC అవసరం. ఒకవేళ క్రోమ్ రన్‌ అయినప్పటికీ.. గూగుల్ నుంచి ఎలాంటి అప్‌డేట్‌లను పొందలేరు. ఇది PCని వైరస్ దాడులు, ఇతర భద్రతా పరమైన ప్రమాదానికి గురిచేస్తుంది. క్రోమ్ 110ను 2021 జులైలో లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. వివిధ కారణాలతో అప్పుడది వాయిదా పడింది. లేటెస్ట్‌ వెర్షన్‌ బ్రౌజర్‌లను ఉపయోగించడానికి లేదా రాబోయే క్రోమ్ 110 వెర్షన్‌ని ఉపయోగించడానికి కంప్యూటర్లను అప్‌గ్రేడ్ చేయాలని, OSని అప్‌గ్రేడ్ చేయాలని రెండు కంపెనీలు తమ వినియోగదారులకు స్పష్టం చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news