రిషబ్ పంత్ కు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఫుల్ ఇస్తూ ప్రకటన

-

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఇటీవల కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పంప్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది.ఇప్పటికే పంత్ ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆరు, ఏడు నెలలు గాయంతో పంత్ క్రికెటుకు దూరమైన అతని మొత్తం జీతాన్ని చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది.

పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరి ఏ లో ఉన్నాడు. అంటే ప్రతిఏటా రూ. 5 కోట్ల రూపాయలు జీతం రూపంలో పంత్ కు అందనుంది. ఇప్పుడు పంత్ కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరమైన అతడికి ఫుల్ సాలరీ అందనుంది. అదే విధంగా పంత్ కు ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కాంట్రాక్టు కూడా ఉంది.

 

ఇందుకు గాను రూ.16 కోట్ల వేతనం అందుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ఈ ఏడాది ఐపీఎల్ కు దాదాపు దూరమైనట్లే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఐపీఎల్-2023 ఆడకపోయినా మొత్తం చెల్లించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news