Breaking : తెలంగాణలో మహిళలకు శుభవార్త.. బడ్జెట్‌లో ఆ పథకానికి 200 కోట్లు

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో గతేడాది ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అమలవుతున్నది. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. గర్భిణుల్లో రక్తహీనత సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు కిట్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లలో పోషకాహార పదార్థాలు, ఐరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాబెట్లు, సిరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. ఇక ఈసారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరోగ్య రంగానికి మొత్తం రూ.12,161 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు వెల్లడించారు.

ఇది గతేడాది కంటే రూ.924 కోట్లు ఎక్కువ అయినప్పటికీ, మొత్తం బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటా రూ.4.18 శాతానికే పరిమితం చేశారు. గత బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు పెట్టిన సర్కార్, ఈసారి రూ.500 కోట్లకు తగ్గించింది. ఇప్పటిదాకా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఒక్క సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెషాలిటీ హాస్పిటల్ పనులు కూడా మొదలు కాలేదు. సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొత్తపేట్, అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెషాలిటీ హాస్పిటళ్లకు ఒక్క ఇటుక కూడా వేయకుండానే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం గతేడాది తరహాలోనే రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. వీటిలో మెషినరీ కోసం రూ.33 కోట్లు, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం రూ. 275 కోట్లు ప్రతిపాదించారు.

Read more RELATED
Recommended to you

Latest news