రెడ్ రోజ్ అంటే ఇష్ట పడని వాళ్ళు ఉండరేమో.. వాటి రంగు ఆ ఫీలింగ్ ను కలిగిస్తుంది..వాలంటైన్స్ డే లో రోజ్ డే కి చాలా ప్రత్యేకత ఉంది.. ప్రేమకు చిహ్నం ఈ రోజ్.. ఇక రోజ్ డేను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం..
వాలెంటైన్స్ వీక్ వచ్చేసింది. ఈ వీక్‌ని 7 రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకమైనట్లుగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రేమపక్షులు. అందులో ఫస్ట్ రోజు రోజ్ డే. రోజా పూలు అనగానే ఎర్రగులాబీలే ఎక్కువగా ప్రేమికుల్ని ఆకర్షిస్తాయి. వీటిని తమకిష్టమైన వారిని ఇచ్చి తమ ప్రేమని తెలియజేస్తారు లవర్స్. అసలు రెడ్ రోజెస్ ఎందుకంత రొమాంటిక్.. అదే విధంగా, వాలెంటైన్స్ వీక్‌లో రోజ్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ పూల పేరు వినగానే చాలా మంది రొమాంటిక్‌గా ఫీల్ అవుతారు. కలర్స్‌లో ఒక్కో కలర్‌కి ఒక్కో ఫీలింగ్‌ని ఆపాదిస్తాం. అలానే రెడ్ అనేది మోస్ట్ రొమాంటిక్ అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకునే చాలా మంది కవులు, రచయితలు ఎర్రగులాబీలపై పాటలు, పద్యాలు, రచనలు చేశారు. సినిమాల్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు…ఎన్నో ప్రేమ కథలు హిట్ అయ్యాయి.. అందుకే వీటికో ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది.మృదువైన కలర్ కళ్ళను ఇట్టే ఆకర్షిస్తాయి. అదే విధంగా, వీటి సువాసన మైండ్‌ని చాలా ఫ్రెష్‌గా ఉంచుతాయి..పురాణాల్లో చాలా మంది ఈ ఎరుపు రంగు పువ్వులనే తమ ప్రేయసిలకు ఇచ్చేవారు. వారికి తమని ప్రేమను తెలిపేందుకు ఈ పువ్వులని వాడేవారు.. అందుకే ప్రేమకు గుర్తుకు ఈ గులాబీలను ఇప్పటికి వాడుతున్నారు..తమ ప్రేమను తెలియజేసేందుకు వీటిని లవర్స్‌కి అందజేస్తారు.. మీకు మీ ప్రియమైన వారికి రొమాంటిక్ ప్లేసులో ఇవ్వండి మీ ప్రేమను తప్పకుండా ఒకే చేస్తారు.. అమ్మాయిలకు చాక్లేట్ అంటే ఇష్టం.. అది కూడా కలిపి ఇస్తే.. మీ ప్రేమ జింగ్ అనాలి.. హ్యాపీ రోజ్ డే..