గౌతం గంభీర్ : ఇండియా బెస్ట్ బ్యాట్స్మన్ యువరాజ్

-

ఇండియా మాజీ క్రికెటర్ మరియు 2011 లో ఇండియాకు వరల్డ్ కప్ రావడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఉన్న క్రికెట్ గురించి తనకు నచ్చిన విధంగా కామెంట్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం ద్వారా మరొక విషయానికి సమాధానం ఇస్తూ వైరల్ గా మారాడు. ఇంటర్వ్యూ లో ఇండియా యొక్క అత్యుత్తమ బ్యాట్స్మన్ ఎవరు అని ప్రశ్నించగా , అందుకు సమాధానంగా గంభీర్ 2011 వరల్డ్ కప్ లో మ్యాన్ అఫ్ ది సిరీస్ గా నిలిచినా లెఫ్ట్ ఆర్మ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను చెప్పాడు. మాములుగా ఎవరైనా బెస్ట్ బ్యాట్స్మన్ అంటే గవాస్కర్, సచిన్ లేదా కోహ్లీ ల పేర్లు చెబుతుంటారు.. కానీ గౌతీ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా యువరాజ్ పేరును చెప్పడంతో వార్త వైరల్ అవుతోంది. ఇక బెస్ట్ కెప్టెన్ ఎవరని అడిగిన ప్రశ్నకు సైతం గౌతమ్ గంభీర్ అనిల్ కుంబ్లే అని చెప్పాడు.

అయితే కుంబ్లే కన్నా ఎక్కువ కాలం కెప్టెన్సీ చేసిన వారిలో కపిల్ దేవ్, గంగూలీ, ధోని మరియు కోహ్లీ లు ఉన్నారు.. అయితే వీరెవ్వరినీ గంభీర్ ఎంచుకోకపోవడం చాలా ఆశ్చర్యం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version