గాంధీఆస్పత్రి, సంతోష్‌నగర్ గ్యాంగ్ రేప్‌లు రెండు ఫేకే : పోలీసులు

-

హైదరాబాద్‌లో రెండు గ్యాంగ్ రేప్ కేసులు ఛేదించారు పోలీసులు. గాంధీఆస్పత్రి, సంతోష్‌నగర్ గ్యాంగ్ రేప్‌లు ఒట్టివేనని పోలీసులు పేర్కొన్నారు. గ్యాంగ్‌రేప్‌లు జరగకపోయినా యువతుల కట్టుకథలుగా నిర్ధారించారు. సంతోష్‌నగర్ గ్యాంగ్ రేప్ పూర్తిగా అభూతకల్పన పేర్కొన్న పోలీసులు…ప్రియుడు పెళ్లిచేసుకోనని చెప్పడంతో అతడిని కేసులో ఇరికేంచే ప్లాన్ చేసిందని వివరించారు.

తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు రేప్ చేశారంటూ స్టోరీ అల్లిన యువతి…రాత్రంతా చాంద్రాయణగుట్టలో తిరిగి రేప్ కథ తల్లికి పోలీసులు తెలిపారు. విచారణలో యువతి చెప్పిందంతా కట్టుకథగా నిర్ధారించామన్నారు పోలీసులు. గాంధీ ఆస్పత్రిలో కూడా యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని.. అక్కాచెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని పోలీసులు పేర్కొన్నారు. అక్క ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో అక్కడే ఉండి పోయింది చెల్లెలు. కల్లు తాగి అపస్మారక స్థితిలో ఉన్న చెల్లి…అక్క విషయాన్ని దాచిపెట్టేందుకు గ్యాంగ్ రేప్ కథ అల్లి ఉందని పోలీసులు వివరించారు. యువతుల మానసిక పరిస్థితి సరిగాలేదని తేల్చారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version