ప్రధాని మోడీ పై గరికపాటి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ విద్యానగర్ శంకర్ మఠంలో ఓ భక్తి కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాన్ని ఒక తపస్సుగా భావించింది భారత జాతి అని… రాజకీయ తపస్సు ఎట్లా ఉంటుందో ఈనాడు ప్రధాని మోడీ లో చూశామని తెలిపారు.

పరిపాలన మరీ సున్నితంగా..మరీ కఠినంగా ఉండకూడదని.. రాజకీయం బాగుండాలంటే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు బయటకు రాకూడదన్నారు గరికపాటి నరసింహా రావు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు రహస్యంగా ఉండబట్టే కాశ్మీర్‌ లో 370 ఆర్టికల్ రద్దు చేయబడింది.రాజ్యాంగాన్ని అతిక్రించి మాట్లాడవద్దని వెల్లడించారు. పరిపాలన రాజ్యాంగం, శాస్త్ర ప్రకారం జరగాలని వెల్లడించారు గరికపాటి నరసింహారావు. నరేంద్ర మోడీ చేస్తున్నది రాజకీయం కాదు తపస్సు.. అందుకే ప్రపంచ దేశాలని మోడీ వైపు చూస్తున్నాయని తెలియజేశారు గరికపాటి నరసిం హారావు. ప్రధాని మోడీ లాంటి ప్రధాన మంత్రిని ఎప్పుడూ తన జీవితంలో చూడలేదని వెల్లడించారు.