ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీ పడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అధినేత. సోలార్, థర్మల్ విద్యుత్తు తయారీ, రవానా, ఓడరేవుల నిర్వహణ.. ఇలా పలు వ్యాపార కార్యకలాపాల వెనుక తనదైన ముద్ర వేశారు అదానీ.
ఇది ఇలా ఉండగా.. తాజాగా వ్యాపార వేత్త గౌతమ్ అదానీ..సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే 3వ అత్యంత ధనికుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. అంతేకాకుండా. తన సంపాదనలో ఫ్రెంచ్ వ్యాపార వేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను ఓవర్ టేక్ చేశారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద 137.4 బిలియన్ డాలర్లకు పెరిగి పోయింది. దీంతో అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా మారిన మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు. చైనాకు చెందిన జాక్ మా, ఇండియాకు చెందిన అంబానీ కూడా ఈ స్థానాలకు ఎప్పుడూ కూడా చేరలేదు.
Gautam Adani now world's 3rd richest person, overtakes Louis Vuitton chief
Read @ANI Story | https://t.co/dl2b32AuLb#GautamAdani #AdaniGroup #AdaniWealth #BloombergBillionairesIndex pic.twitter.com/HVkekeBZVY
— ANI Digital (@ani_digital) August 30, 2022