ఆ యాప్ మీ ఫోన్లో ఉంటే పిల్లలకు ఎన్నో లాభాలున్నాయి తెలుసా?

-

ఒకప్పుడు పిల్లలు ఆటలు ఆడుకోనేవారు.బయట ఎలా పడితే అలా చేస్తూ నానా హంగామా చేస్తూ ఉంటారు..కానీ ఈరోజుల్లో పిల్లలు అన్నీ ఫోన్లోనే.. స్మార్ట్ యుగం అని చెప్పాలి..ఆటలు, పాటలు ఇలా అన్నీ ఫోన్లోనే..ఆరోగ్యాన్ని పెంచే ఆటలూ కనిపించవు. సందు దొరికితే చాలు.. స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, పిల్లల చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. సోఫాకు అతుక్కుపోయి. గంటల తరబడి వీడియో గేమ్స్‌తో టైంపాస్ చేస్తున్నారు..

ఫోన్ వల్ల ఎన్ని లాభాలున్నాయో,అంతే నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.ఫోన్ వల్ల రోగాలు కూడా ఈజిగా వస్తాయని నిపుణులు అంటున్నారు…స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడపటం వల్ల ప్రవర్తన సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలు, ఒబేసిటీ, నిద్రలేమి, డిప్రెషన్ వంటి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు..అందుకే పిల్లలకు ఫొన్లను దూరం పెట్టాలని అంటున్నారు.. అందుకోసం ఓ ప్రత్యేకమైన యాప్ ఉందట..

ఆ యాప్ తో గేమ్ లను ఇంటి బయట మాత్రమే ఆడాలట..అది పిల్లలకు తెలియకుండానే వ్యాయామం చేయిస్తుందట..వింటూంటేనే ఆసక్తిగా వుంది కదూ..ఆ యాప్ పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది అమెరికా యాప్..ఆండ్రూ హాల్‌ అనే గేమింగ్‌ డెవలపర్‌.. స్మార్ట్‌ ఫోకు అతుక్కుపోయిన పిల్లల కోసం ఓ అద్భుతమైన యాప్‌ను డెవలప్‌ చేశాడు. అదే జెన్‌మూవ్‌..ఇది ఒక గెమింగ్ యాప్..ఇందులో 50 రకాల ఆటలు ఉంటాయి..ఒక్కో గేమ్‌లో ఒక్కో రకమైన వ్యాయామం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన గేమ్స్‌ ఉన్నాయని అన్నారు. అయితే ఇలా రోజుకు 10 నిమిషాల పాటు ఈ గేమ్‌ ఆడటం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటారని అన్నాడు..ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది.ఒక గేమ్ మాత్రమే కాదు ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లను కూడా వీక్షంచవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news