మనకోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అందులో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఒకటి. ఈ స్కీమ్ తో ఎన్నో లాభాలని పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే రూ. 2 లక్షలని పొందవచ్చు. వడ్డీ రేటును 70 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. 7 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.7 శాతానికి చేరింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..
ఈ స్కీమ్ కాలపరిమితి 5 ఏళ్లుగా ఉంటుంది. మీరు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే మీకు వడ్డీ రూపంలోనే రూ. 400 వరకు అందుతుంది. ప్రతి మూడు నెలలకు ఒక సారి వడ్డీ రేట్లను మారుస్తుంది కేంద్రం. వడ్డీ రేటు పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది. లేకపోతె అలానే ఉండచ్చు కూడా. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యవచ్చు. మైనర్ల పేరుపై కూడా ఈ స్కీమ్ ని ఓపెన్ చేసేయవచ్చు. అయితే వారికి గార్డియన్ అవసరం ఉంటుంది. పదేళ్లకు పైన వయసు ఉన్న వారు వారి పేరుపైన ఈ స్కీమ్‌లో చేరవచ్చు. కనిష్ఠంగా రూ.1000 ఇన్వెస్ట్ చేయవచ్చు ఎంతైనా పెట్టచ్చు.
గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. వడ్డీ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలోనే చెల్లిస్తారు. ఈ స్కీము లో మీరు కనుక రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ టైం కి రూ. 7.50 లక్షల వరకు అందుతాయి. వడ్డీ రూపంలోనే రూ.2 లక్షలకు పైగా మీకు వస్తాయి. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. రిస్క్ లేని స్కీమ్ ఇది. పైగా ఈ స్కీము తో పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఏటా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసేందుకు అవుతుంది.