వాట్సాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ని ఇలా పొందొచ్చు…!

-

చాలా మంది ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించమని అంటున్నారు. ఈ వాక్సినేషన్ సర్టిఫికెట్ పొందాలంటే ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా సులభంగా పొందవచ్చు. మీరు వాక్సినేషన్ సర్టిఫికెట్ కోసం కష్టపడక్కర్లేదు కూడా. అయితే మరి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఎలా పొందాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ఉంటుంది కాబట్టి సులభంగా మీరు మీ ఫోన్ లో వాట్సాప్ ని ఓపెన్ చేసి సర్టిఫికేట్ ని 60 సెకండ్లలో పొందొచ్చు. వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఎలా పొందాలి..?

మొదటి స్టెప్: ముందుగా ఈ వాట్సాప్ నెంబర్ 9013151515 కి హాయ్ అని మెసేజ్ పంపండి.
రెండవ స్టెప్: ఒకసారి మెసేజ్ పంపిన తర్వాత మీకు కొన్ని టాపిక్స్ కనపడతాయి. అక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. కనుక రెండు అని టైప్ చేసి దానిని మళ్లీ పంపండి.
మూడవ స్టెప్: మొత్తం మూడు ఆప్షన్లు మీకు వస్తాయి. ఇక్కడ మూడు అంకెని మీరు మళ్లీ టైప్ చేసి పంపాలి. ఈ మూడవ ఆప్షన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ ఆప్షన్. నాల్గవ స్టెప్: మీ ఫోన్ కి ఓటిపి వస్తుంది. దానిని మీరు మళ్లీ టైప్ చేసి పంపించాలి.
ఐదవ స్టెప్: ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ నెంబర్ తో వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళ పేర్లు వస్తాయి.
ఆరవ స్టెప్: మీరు ఎవరి సర్టిఫికెట్ అయితే డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్లది ఎంటర్ చేయాలి. మీ వాట్సాప్ కి పీడిఎఫ్ ఫార్మాట్ లో ఒక సర్టిఫికెట్ వస్తుంది. దానిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంతే. ఎంతో ఈజీగా ఇలా వాట్సాప్ సర్టిఫికేట్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version