గ్రేటర్‌ మేయర్‌ ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ ఎప్పుడంటే ?

-

ఫిబ్రవరి 11న జిహెచ్ఎంసి కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. మధ్యాహ్నం 12:30 కు జిహెచ్ఎంసి మేయర్ ఎన్నిక జరపనున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండనుందని పేర్కొన్నారు. దీని పర్యవేక్షణకు గాను సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.

  ఎన్నికల కమిషన్ జారీ చేసిన పరోక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రిసైడింగ్ అధికారి ఫిబ్రవరి 6 వ తేదీ లోపు ఈ ప్రత్యేక సమావేశము నోటీస్ ని జీహెచ్ఎంసి మెంబర్ల౦దరికి జారీచేయాలి. ఫిబ్రవరి 11 వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసి వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం గం. 12.30 లకు జరుగు ప్రత్యేక సమావేశములో మొదట మేయర్ ఎన్నిక ఆ తరువాత ఉప మేయర్ ఎన్నిక జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news