కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్లు ఉన్న ఒక బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో జరిగింది. కాగ కామారెడ్డి జిల్లాలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఉన్న 17 ఏళ్ల బాలిక తన తల్లి దండ్రులతో కలిసి ఉంటుంది. అయితే సోమ వారం తమ ఇంట్లో తల్లి దండ్రులు లేని సమయంలో బాలిక తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తల్లి దండ్రులు ఇంటికి వచ్చి చూడగానే.. బాలికి ఉరి వేసుకుని ఉంది. దీంతో కుటుంబ సభ్యుల తో పాటు స్థానికులు కామారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగ బాలిక ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే పోలీసులు కూడా బాలిక ఆత్మహత్య గల కారణాల కోసం అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.