మతం మార్చి పెళ్లి.. పైగా గదిలో బంధించి పలుమార్లు గ్యాంగ్‌ రేప్..

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. రోజూ ఎక్కడో ఓచోట స్రీలు ఏదో ఒక విధంగా వేధింపులకు గురవుతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌ లోని గోండా జిల్లాలో ఓ యువతిని బలవంతంగా మతం మార్చి, పెళ్ళి చేసుకుని, సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ 23 ఏళ్ళ యువతి గత నెలలో అపహరణకు గురైనట్లు తెలిపారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జావేద్ అనే వ్యక్తి సోదరుడు బాధితురాలిని జూన్ 14న అపహరించాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి, ముంబై తీసుకెళ్ళాడు.

Jharkhand Horror: 16-year-old gang-raped by friend, 8 others in Dumka |  Catch News

జావేద్‌తో ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవారు. బాధితురాలిని ముంబైలో ఓ గదిలో జావేద్ నిర్బంధించి, ఆమె మతాన్ని మార్చి, అనంతరం పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై జావేద్, మరో ఇద్దరు వ్యక్తులు అనేకసార్లు అత్యాచారం చేశారు. ఈ విషయాలను బయటకు వెల్లడిస్తే చంపేస్తానని జావేద్ బెదిరించాడు. ఆమెను జూన్ 23న కల్నల్ గంజ్ రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టనట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ సెక్షన్ల ప్రకారం నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తరలించినట్లు.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.