Breaking : LKG విద్యార్థినిపై ప్రిన్సిపాల్‌ డ్రైవర్‌ లైంగిక వేధింపులు.. చితకబాదిన పేరెంట్స్‌

-

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. గుడి, బడి, చిన్నా, పెద్దా అని తేడా లేకుండా.. లైంగిక వాంఛ తీర్చుకోవడానికి మృగాళ్లా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో LKG విద్యార్థినిపై(4) ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ రజినీకుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. గత 2 నెలల నుంచి బాలిక ప్రవర్తనలో మార్పును గమనించినట్లు తల్లితండ్రులు చెప్పారు.

High school girl rape porn video daughter weeps and tells her pain -  हाईस्कूल की छात्रा का रेप, अश्लील वीडियो, बेटी ने रो-रो कर बताया अपना दर्द

అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో చిన్నారి ఉందని, నిన్న చిన్నారి నీరసంగా ఉండి ఏడవడంతో అసలు విషయం తెలుసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా ఉన్న వ్యక్తి డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వచ్చి చిన్న పిల్లలను ఇబ్బందులు గురి చేస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. చాలా మంది పిల్లలు డ్రైవర్ రజినీకుమార్ ను చూసి భయపడుతున్నారని, డ్రైవర్ రజినికుమార్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రజినికుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news