ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌… మారుతితో సినిమా టైటిల్‌ అప్పుడే..

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నుంచి మాంచి హిట్‌ కోసం డార్లింగ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్‌తో అసంతృప్తితో ఉన్న ప్రభాస్‌ అభిమానులు త్వరలో రానున్న ఆదిపురుష్‌ కోసం వేయిట్ చేస్తున్నారు. అయితే.. ప్రభాస్ నుంచి ‘ఆది పురుష్’ విడుదల దిశగా పనులను జరుపుకుంటూ ఉంటే, ఆ తరువాత సినిమాగా ‘సలార్’ లైన్లో ఉంది. ఈ నేపథ్యంలో మారుతితో సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అసలు ఈ కాంబినేషన్ పై వస్తున్న వార్తలు నిజమేనా? అనే సందేహాలు చాలామందిలో తలెత్తాయి. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఫొటో షూట్ జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభాస్ పై ఫొటో షూట్ ను నిర్వహించడానికి కూడా కారణం ఉందని అంటున్నారు.

 

What we know so far about Prabhas-Maruthi project - Telugu News -  IndiaGlitz.com

ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను వదలాలనే ఉద్దేశంతో ఫొటో షూట్ జరిపారని అంటున్నారు. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. ఒక పాత సినిమాహాలు చుట్టూ తిరిగే కథ ఇది అని అంటున్నారు. తాత – మనవడుగా ప్రభాస్ కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలకు అవకాశం ఉండగా, నిధి అగర్వాల్ – మాళవిక మోహనన్ ను ఆల్రెడీ ఎంపిక చేశారు. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news