చైనా ర్యాపిడ్ కిట్స్ వెనక్కు ఇచ్చేయండి…!

-

ఒక పక్క కరోనా వైరస్ తో దేశం ఇబ్బంది పడుతున్న తరుణంలో చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి విషయంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అసలు వాటిని వాడ వద్దని ఐసిఎంఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చైనా ర్యాపిడ్ కిట్స్ లో నాణ్యత లేదని ఐసిఎంఆర్ ప్రకటన చేసింది. వాటిని చైనాకు పంపిస్తే మంచిది అని సూచించింది.

కరోనా పరిక్షలు చెయ్యడానికి గానూ చైనా నుంచి భారీగా టెస్ట్ కిట్స్ ని దిగుమతి చేసుకున్నారు. వాటి పని తీరు సరిగా లేదని కచ్చితంగా కరోనా పరిక్షలు అవి చేయలేకపోతున్నాయని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం 4 శాతం మాత్రమే అవి సరైన ఫలితాన్ని ఇచ్చాయి. వాటిని నమ్ముకుని పరిక్షలు చేస్తే దేశం తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

రాజస్థాన్, కేరళ సహా పలు రాష్ట్రాలు వాటిని వాడటానికి ముందుకు రాలేదు. ఇతర రాష్ట్రాలు కూడా వాటిని వాడకుండా ఉంటే మంచిది అని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 1396 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ 872 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news